
కాంతారా చాప్టర్ 1 ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన తరువాత ఇప్పుడు OTTలో ప్రసారం కానుంది.
కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 31, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రిషబ్ శెట్టి స్వయంగా రచన, దర్శకత్వం వహించగా, అర్వింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించగా, విజయ్ కిరగందూర్ హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
థియేటర్స్ లో చూడటం మిస్ అయినా వాళ్ళు, OTT లో మిస్ అవ్వకుండా చూడండి.
