హే బల్వంత్: విడుదలకు ముందు సుహాస్ తొలి A సర్టిఫైడ్ మూవీగా భారీ హైప్

Hey Balwanth

నటుడు సుహాస్ నటించిన తాజా కామెడీ డ్రామా “హే బల్వంత్” విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదట ఈ చిత్రానికి హే భగవాన్ అనే టైటిల్ ఉండగా, రిలీజ్‌కు ముందు దానిని హే బల్వంత్ గా మార్చారు. చివరి నిమిషంలో టైటిల్ మారినా, సినిమా విజయంపై మేకర్స్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A (Adults Only) సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. లీడ్ రోల్‌లో సుహాస్ నటించిన చిత్రాల్లో ఇది మొదటి A సర్టిఫైడ్ మూవీ కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. సాధారణంగా కంటెంట్ ఆధారిత, ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు చేసే సుహాస్ ఈసారి కొత్త దిశగా అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది.

ఇక సినిమా రన్‌టైమ్ 2 గంటలు 14 నిమిషాలు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శివాని నగరం హీరోయిన్‌గా నటిస్తూ సుహాస్‌కు జోడీగా కనిపించనుంది. సీనియర్ నటుడు వి.కె. నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపీ అచ్చర దర్శకత్వం వహించగా, బి. నరేంద్ర రెడ్డి నిర్మాణం వహించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. కథను శణ్ముఖ ప్రశాంత్ అందించారు.

ఇక సహాయ పాత్రల్లో సుదర్శన్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతాన్ని వివేక్ సాగర్ అందించారు.

హే భగవాన్ నుంచి హే బల్వంత్‌గా టైటిల్ మార్చడం వల్ల సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. కథకు సరిపోయేలా టైటిల్ మార్చినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ మార్పు సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

ఇంకా “A” సర్టిఫికెట్ కూడా రావడంతో సినిమా కంటెంట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. కామెడీతో పాటు బోల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం సుహాస్ కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుందా అన్నది చూడాలి.

Similar Articles

Comments

తాజా వార్తల