
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా కామెడీ డ్రామా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో ఫిబ్రవరి 20, 2026 నుండి స్ట్రీమింగ్‌కు రానుంది. ముఖ్యంగా, ఈ మూవీ థియేటర్ రిలీజ్‌కు ముందే జీ5 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.
రవితేజ గత కొన్ని చిత్రాలతో పోలిస్తే, భర్త మహాశయులకు విజ్ఞప్తి కొంచం మంచి స్పందనను అందుకుంది ప్రేక్షకుల నుండి. క్లిన్ హ్యూమర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేటబుల్ స్టోరీలైన్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా మరియు కామెడీ కాంబినేషన్ తో రూపొందింది. భార్యాభర్తల సంబంధాలు, కుటుంబ బంధాలు, వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో మరింత మంది ప్రేక్షకులను చేరుకోనుంది.
ఫిబ్రవరి 20 తేదీ ఖరారైన తర్వాత, ఓటీటీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంటి వద్దే ఈ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
