
బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుండగా తాజా ట్రెండ్స్ ప్రకారం NDA గట్టి ఆధిక్యంలో ఉంది. బీజేపీ–JD(U) కూటమి ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈసారి పోలింగ్‌లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం ఓటింగ్ శాతం 67% చేరుకున్నారు. ఇది బిహార్‌లో ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతిపక్ష RJD కొన్ని కీలక స్థానాల్లో పోటీ చేస్తూనే ఉన్నప్పటికీ, మొత్తం ఫలితాల పరంగా NDAను చేరుకోవడం కష్టంగా మారింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని RJD ఆశించిన స్థాయిలో స్థానం దక్కించుకుంటుందా అనే ప్రశ్న ఇంకా కొనసాగుతోంది.
లెఫ్ట్ పార్టీలు ఈసారి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. జన సురాజ్ పార్టీ కొన్ని చోట్ల మంచి పోటీ ఇస్తున్నప్పటికీ, పెద్ద మార్పు తీసుకురావడంలో ఇంకా వెనుకబడి ఉంది.
ఇప్పటికీ చివరి అధికారిక ఫలితాలు వెలువడాల్సి ఉన్నా, తొలి ట్రెండ్స్ ప్రకారం బిహార్‌లో NDA మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
