బిగ్ బాస్ తెలుగు 9లో అత్యంత ట్రెండింగ్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా

Do you know who the most trending contestant in Bigg Boss Telugu 9 is

బిగ్ బాస్ తెలుగు 9లో ఊహించని రీతిలో సుమన్ శెట్టి ఈ వారం అత్యంత ట్రెండింగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు. షో మొదలైనప్పట్నుంచి త్వరగా ఎలిమినేట్ అవుతారని చాలామంది అనుకున్నా, ఆయన 9వ వారం వరకు బలంగా నిలబడటం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

హౌస్‌లో ఎఎవరి గురించి వెనకాల మాట్లాడ్డం గాని చేయలేదు, ఏమి దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పే సుమన్ శెట్టిపట్ల ప్రేక్షకుల్లో మంచి సానుభూతి ఏర్పడింది. నిజాయితీగా ప్రవర్తించడం, ఎవరినీ బాధపెట్టని తీరు, అవసరమైనప్పుడు టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఆయనకు అదనపు ప్లస్‌గా మారాయి.

అంతేకాదు, ఆయన చూపిస్తున్న చిన్న చిన్న కామెడీ యాంగిల్ హౌస్‌లోని టెన్షన్‌ను తగ్గిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఆయన ఓవర్‌గా కామెడీ చేయకుండా, తన స్టైల్‌లో నడుచుకోవడం మరింత నేచురల్‌గా కనిపిస్తోంది.

ఈ వారం ఓట్ల లెక్కలు మాత్రం షాకింగ్‌గా మారాయి. పెద్దగా హంగామా చేయకుండా, సైలెంట్‌గా ఆడుతున్న సుమన్ శెట్టికి భారీ ఓట్లు రావడం. సోషల్ మీడియాలో ఆయనను “మోస్ట్ జెన్యూయిన్ కంటెస్టెంట్”గా ప్రశంసిస్తున్నారు.

ఇలాగె ఆడితే సుమన్ శెట్టి ఫైనలిస్టుల జాబితాలో ఉండే అవకాశాలు మరింత బలంగా కనిపిస్తున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల