Telugu Movies: తెలుగులో స్టార్ హీరోల డిజాస్టర్ మూవీస్ ఇవే.. ఏయే సినిమాలో తెలుసా?

Telugu Movies: బాహుబలి మూవీతో తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. దాని తర్వాత టాలీవుడ్ హీరోలు చాలా మంది పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను విడుదల చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. అయితే, ఇందులో కొన్ని సినిమాలు చాలా స్పీడ్ గా డిజాస్టర్ లిస్టులో చేరిపోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు సైతం ఈ లిస్టులో ఉన్నాయి. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ డిజాస్టర్ గా నిలిచింది.

disaster movie

రాధే శ్యామ్ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే, మొత్తంగా మూవీ టార్గెట్ కు 120 కోట్ల రూపాయల దూరంలో నిలిచి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ప్లాప్ అయ్యింది. 132 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా సుమారు 80 కోట్ల నష్టాలను మిగిల్చింది.

బోల్తా కొట్టిన అజ్ఞాత వాసి..

పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాత వాసి మూవీ 70 కోట్ల బడ్జెట్ తో వచ్చింది. అయితే, మొత్తం 123 కోట్లకు అమ్మారు. కానీ 57 కోట్లే వసూలు చేసి 67 కోట్ల నష్టాలను మిగిల్చింది. పవన్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిపోయింది. బాలయ్య, రానా నటించిన మహానాయకుడు మూవీ 30 కోట్లతో తెరకెక్కించారు. 51 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. అయితే, కేవలం ఐదు కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

పవన్ నటించిన మరో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ కూడా సుమారు 37 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మూవీకి 32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 84 కోట్లు. అంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ భారీ హిట్ అవగా.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Similar Articles

Comments

తాజా వార్తల