
ఇటీవలే విడుదల అయి ప్లాప్ అయిన కామెడీ డ్రామా “మిత్ర మండలి” ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ సినిమా, ఇప్పుడు ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయేంద్ర ఎస్. దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అక్టోబర్ 16, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే, మంచి అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.
ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ హీరోగా నటించగా, ప్రముఖ డిజిటల్ క్రియేటర్ నిహారికా ఎన్ఎం తన తెలుగు సినీ ప్రయాణాన్ని ఈ చిత్రంతో ప్రారంభించింది. సహాయ పాత్రల్లో రాగ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బేహరా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటించారు.
ఈ చిత్రాన్ని కల్యాణ్ మంతినా, భాను ప్రతాప్, డా. విజయేంద్ర రెడ్డి తిగల నిర్మించారు.
ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతాన్ని అందించగా, సిద్ధార్థ్ ఎస్.జె. సినిమాటోగ్రఫీ, కోడాటి పావన్ కళ్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
థియేటర్లలో విఫలమైన ఈ చిత్రం డిజిటల్ వేదికలో విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.
