తమిళ హీరో అథర్వా నటించిన తాజా చిత్రం “థనల్” OTTలో ప్రసారం అవుతుంది అని ప్రకటించారు. సినిమా Prime Videoలో అక్టోబర్ 17, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రం సెప్టెంబర్ 2025లో థియేట్రికల్ రిలీజ్ అయ్యి, విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ పొందింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషలలో స్ట్రీమ్ అవుతుంది.
అథర్వా తో పాటు, సినిమాలో లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలో నటించారు.ఈ సినిమాను రవీంద్ర మాధవ దర్శకత్వం వహించగా, సినిమాకి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం సమకూర్చారు. శక్తి శరవణన్ కెమెరా హ్యాండిల్ చేశారు, మరియుఎం. జాన్ పీటర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మరి ఈ తమిళ్ చిత్రాన్ని, తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.