Sambarala Yeti Gattu Glimpse Out Now: సాయి ధరమ్ తేజ్ బర్త్‌డే స్పెషల్: సంబరాల యేటిగట్టు ఫస్ట్ గ్లింప్స్ విడుద‍ల

Sambarala Yeti Gattu Glimpse Out Now

సాయి ధరమ్ తేజ్ జన్మదిన రోజు సందర్బంగా అంబిషస్ ప్రాజెక్ట్ ‘సంబరాల ఎటిగట్టు’ గ్లింప్స్ విడుదలైంది. ఒక్క నిమిషం ఆరు సెకన్ల ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. విజువల్స్, ప్రెజెంటేషన్‌ పరంగా చూస్తే ఇది “స్మాల్ ఫిల్మ్” లా అనిపించట్లేదు, పక్కా గ్రాండ్ స్కేల్ సినిమా అనిపించేలా ఉంది.

గ్లింప్స్ మొదటి ఫ్రేమ్ నుంచే అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ఆకట్టుకుంటుంది. ప్రతి షాట్‌ కూడా భావోద్వేగంతో, పెద్ద స్కేల్‌తో రూపొందించబడింది. అజనీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.

డెబ్యూట్ డైరెక్టర్ రోహిత్ కె.పీ. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ గ్లింప్స్ చూస్తే, కొత్త దర్శకుడు ఈ సినిమా తీసాడా అనిపిస్తుంది, చాలా మేచ్యూర్డ్ మేకింగ్, విజన్ కనిపిస్తోంది.

స్టోరీని మేకర్స్ రివీల్ చేయకపోయినా, చూపిన విజువల్స్ చూస్తుంటే యూనివర్సల్ స్టోరీ ఉండబోతోందనే భావన కలుగుతోంది.

సాయి ధరమ్ తేజ్ ఇందులో ‘బాలి’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. బర్త్‌డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ అభిమానులకు నిజంగా ట్రీట్‌లా మారింది.

పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న సంబరాల ఎటిగట్టు అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత, సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మరో మైలురాయి అవ్వాలని ఆశిద్దాం.

Similar Articles

Comments

తాజా వార్తల