రవితేజ మేనల్లుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమైన గ్రామీణ నేపథ్య చిత్రం ‘మారెమ్మ’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందని ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘మారెమ్మ’ ఓటీటీ విడుదల తేదీని “ఆహా” అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9, 2026 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం.
ఈ సినిమాలో మాధవ్ భూపతిరాజుతో పాటు దీపా బాలు, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపలక్ష్మి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ జీవితం, అక్కడి పరిస్థితుల నేపథ్యంలో కథ సాగుతుంది.
ప్రశాంత్ ఆర్. విహారి, బి ప్రదీప్ దత్తా సినిమాకు సంగీతం అందించారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీ ద్వారా ‘మారెమ్మ’ను చూసే అవకాశం లభించనుంది.
