Mr X OTT రిలీజ్ డేట్: థియేటర్లలో నిరాశపరిచిన ఆర్య స్పై థ్రిల్లర్ ఇప్పుడు OTTలోకి రాబోతుంది

తమిళ స్టార్ ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ Mr. X ఇప్పుడు OTT ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. భారీ తారాగణం, స్టైలిష్ మేకింగ్, హై టెక్నికల్ వాల్యూస్ ఉన్నప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mr X OTT

ప్రపంచ వినాశనాన్ని అడ్డుకునే స్పై మిషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 14, 2026 నుంచి JioHotstar OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అదే సమయంలో విదేశీ ప్రేక్షకుల కోసం Simply South ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రానికి మను ఆనంద్ కథ, దర్శకత్వం వహించారు. శ్రీ వినీత్ జైన్ మరియు ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సంగీతాన్ని ధీబు నినన్ థామస్ సమకూర్చారు.

ఈ సినిమాలో ఆర్యతో పాటు గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘ, రైజా విల్సన్, అతుల్య, జయప్రకాశ్, కాలీ వెంకట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

స్పై థ్రిల్లర్ కథాంశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, స్టైలిష్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ OTTలో ఈ చిత్రం మంచి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల