
హనుమాన్ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో మై థాలజికల్ ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు.
అయితే ఈసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంతో వస్తున్నాడు మరియు ఈసారి తనుదర్శకత్వం వహించకుండా క్రియేటర్ గ వ్యవహరిస్తూ, పూజ అపర్ణ కొల్లూరుని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నాడు.
ఇక చిత్రం ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నటి భూమి శెట్టి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
అంతే కాకుండా, అసలు ఈ భూమి చెట్టి ఎవరు అని చాల మంది ఆలోచిస్తున్నారు. అయితే తిను, కన్నడ నటి, అక్కడ సీరియళ్ళు, బిగ్ బాస్ మరియు కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో, విజయ్ దేవరకొండ చిత్రం కింగ్డమ్ లో, సత్య దేవ్ భార్య గా నటించింది.
ఫస్ట్ లుక్‌లో భూమి శెట్టి శక్తివంతమైన, దేవీ రూపంలో దర్శనమిచ్చింది. మొత్తం పోస్టర్ దేవీ మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా హనుమాన్ యూనివర్స్‌లో భాగంగా వస్తుంది అని తెలిపారు.
వివరాల ప్రకారం, మహాకాళి సినిమా షూటింగ్ 2026 ఆరంభంలో ప్రారంభం కానుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, మిథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.
ఫస్ట్ లుక్ ఇప్పటికే సంచలనంగా మారడంతో, అభిమానులు ఇప్పుడు టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
