లవ్ టుడే మరియు డ్రాగన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న యువ నటుడు ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో యువతరానికి దగ్గరైన ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా విడుదలై, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది. దీంతో ప్రదీప్ తన కెరీర్‌లో హ్యాట్రిక్ హిట్ సాధించినట్లు కనిపిస్తోంది.
లవ్ టుడే మరియు డ్రాగన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రదీప్ క్రేజ్ చాల పెరిగిపోయింది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి మైత్రి మూవీ మేకర్స్ డ్యూడ్ చిత్రాన్ని రూపొందించగా, వారి ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయినట్టే ఉంది.
కథ & నటన
డ్యూడ్ కథ సింపుల్‌గానే ఉన్నా, భావోద్వేగాలు, కామెడీ, మోమెంట్స్‌తో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ ఇంటర్వల్ బ్లాక్‌లో ఊహించని ట్విస్ట్తో సస్పెన్స్ పెంచుతుంది.
సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది, అదేవిదంగా, స్క్రీన్ ప్లే లో మలుపులు, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్‌లో టర్నింగ్ పాయింట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ తన సిగ్నేచర్ స్టైల్లో మరోసారి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీ, ఎమోషన్ రెండింటినీ అడ్డరగొట్టేసాడు.
మమితా బైజు కూడా కామెడీ గాని, ఎమోషనల్ సీన్స్ గాని చాల బాగా చేసింది. షరత్‌కుమార్ ప్రీ-ఇంటర్వల్ సీక్వెన్స్‌లో అడ్డరగొట్టేసాడు, అసలు ఆ ట్విస్ట్ మాములుగా ఉండదు.
టెక్నికల్ హైలైట్స్
మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో మ్యూజిక్ బాగా ఎలివేట్ అయింది.
ఫైనల్ వెర్డిక్ట్
సింపుల్ స్టోరీ అయినా, మంచి ఎమోషన్, కామెడీ, మ్యూజిక్‌తో డ్యూడ్ సినిమా పక్కా ఎంటర్‌టైనర్‌గా నిలిచింది.
రేటింగ్: 3.75/5