
తమిళ నటుడు అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘బాంబ్’ అనే తాజా సోషల్ డ్రామా చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.
విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, డి. ఇమాన్ సంగీతం అందించారు, రాజ్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు మరియు సుధా సుకుమార్, సుకుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళంలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రావడంతో, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.
