కిరణ్ అబ్బవరం నిర్మాతగా తీసిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా OTT లోకి రాబోతుంది

తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 50 మంది కొత్త నటీనటులను ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. థియేటర్లలో ఏప్రిల్ 17, 2026న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ప్ర‌ముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహా వీడియో అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా మే 15, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం 24 గంటల ముందుగానే సినిమా అందుబాటులోకి రానుంది.

Thimmarajupalli TV OTT Release Date

OTTలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తిమ్మరాజుపల్లి టీవీ

థియేటర్లలో విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కొత్తవారికి అవకాశం కల్పిస్తూ కిరణ్ అబ్బవరం చేసిన ప్రయత్నం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే విడుదల తర్వాత సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.

ఇప్పుడు OTT విడుదలతో ఈ సినిమాకు కొత్త ప్రేక్షకాదరణ లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. గ్రామీణ నేపథ్య కథలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరవుతుందని భావిస్తున్నారు.

నటీనటులు మరియు సాంకేతిక బృందం

ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ మరియు లతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి V. మునిరాజు దర్శకత్వం వహించగా, వంశీకాంత్ రేఖానా సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీని అక్షయ్ రామ్ పొడిశెట్టి నిర్వహించారు.

Similar Articles

Comments

తాజా వార్తల