ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా OTTలోకి వచ్చేసిన “గాయపడ్డ సింహం”

“గాయపడ్డ సింహం” సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ క్రైమ్ కామెడీ సినిమా ఇప్పుడు OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఈ చిత్రం ఈరోజు (మే 22, 2026) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాపై కొంతమేర అంచనాలు ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం మరియు ఆసక్తికరంగా సాగని స్క్రీన్‌ప్లే కారణంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Gaayapadda Simham

అయితే డిజిటల్ హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు ఈ సినిమాను OTTలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

ఈ సినిమాలో శ్రీ విష్ణు, J. D. చక్రవర్తి, ఫరియా అబ్దుల్లహ్, మానస చౌదరి, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, సుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించగా, కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బన్సల్ కలిసి నిర్మించారు. స్వీకార్ అగస్తి సంగీతం అందించగా, విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విప్లవ్ నైషాదం ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

థియేటర్లలో నిరాశపరిచిన గాయపడ్డ సింహం సినిమా OTTలో అయినా మంచి స్పందన అందుకుంటుందేమో చూడాలి.

Similar Articles

Comments

తాజా వార్తల