థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అర్జున్ దాస్, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించిన హైస్ట్ కామెడీ డ్రామా “కాన్ సిటీ” ఇప్పుడు OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు హరీష్ దురైరాజ్ రూపొందించిన ఈ చిత్రం జూలై 24 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.
జూన్ 26న థియేటర్లలో విడుదలైన కాన్ సిటీ తన వినూత్న కథాంశంతో మంచి ఆసక్తిని రేకెత్తించింది. థియేట్రికల్ రన్ పూర్తయిన అనంతరం ఈ చిత్రం ఇప్పుడు జూలై 24, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. హాస్యం, క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవించిన ఈ చిత్రం OTTలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంగళూరులో సాధారణ కుటుంబంలా జీవించే ఒక కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే బయటకు సాధారణంగా కనిపించే ఈ కుటుంబం వాస్తవానికి తెలివైన మోసగాళ్ల బృందం. అర్జున్ దాస్, అన్నా బెన్, యోగి బాబు, వడివుక్కరసి ఈ కుటుంబ సభ్యులుగా కనిపిస్తారు.
ఈ చిత్రంలో అర్జున్ దాస్, అన్నా బెన్‌లతో పాటు యోగి బాబు, వడివుక్కరసి, అఖిలన్, నంద గోపాల్, సాక్షి వైద్య, దీపా రామానుజం, అరుల్ దాస్, రాధా రవి, షాజీ చెన్, రమేష్ తిలక్, తంబి రామయ్య, ఇమ్మాన్ అన్నాచ్చి, భరద్వాజ్ రంగన్, మదన్ దక్షిణామూర్తి, రఘు ఈసాకి, పొన్‌వన్నన్, సతానంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కాన్ సిటీ చిత్రానికి హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీని అరవింద్ విశ్వనాథన్, ఎడిటింగ్‌ను అరుల్‌మోసెస్ ఎ, ఆర్ట్ డైరెక్షన్‌ను రాజ్ కమల్ నిర్వహించారు. పవర్ హౌస్ పిక్చర్స్ తమ తొలి నిర్మాణంగా ఎం&ఎం మూవీ మేకర్స్, క్లౌట్ స్టూడియోస్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించి, క్రైమ్, కామెడీ, ఎమోషన్‌లతో కూడిన ఈ వినోదాత్మక హైస్ట్ డ్రామాను ఆస్వాదించవచ్చు.
