దివాళీ సీజన్ సమయంలో, లక్షలాది ప్రయాణికులు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, వెబ్ సైట్ అనుకోకుండా డౌన్ అయిపోవడంతో, స్లోగా రన్ అవ్వడం, మరియు టెంపరర్లి అనేబల్ డ్యూ తో సర్వీస్ రేకేవెస్ట్ అని రావడంతో,తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు.
IRCTC అధికారులు సాంకేతిక సమస్యలను అంగీకరించారు మరియు వెబ్‌సైట్ పూర్తిగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. “దివాళీ సీజన్‌లో ఉన్న అధిక డిమాండ్ గురించి మాకు తెలుసు. వెబ్‌సైట్ స్థిరంగా పనిచేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం,” అని IRCTC ప్రతినిధి పేర్కొన్నారు.
ప్రయాణికులు పేజీని రిఫ్రెష్ చేయడం లేదా బుకింగ్ కోసం ప్రత్యామ్నాయ సమయాలను ప్రయత్నించడం సిఫార్సు చేస్తున్నారు. అయితే IRCTC మొబైల్ యాప్ ఉపయోగించమని సూచించింది, ఇది వెబ్‌సైట్ కంటే ట్రాఫిక్‌ని బాగా హ్యాండిల్ చేస్తుంది అని తెలిపారు. సాంకేతిక బృందం సమస్యను పరిష్కరించేవరకు వినియోగదారులు సహనంతో ఉండాలని అధికారులు కోరుతున్నారు.
దివాళీ సందర్భంగా లక్షలాది భారతీయులు తమ స్వగ్రామాలకు వెళ్ళి కుటుంబంతో వేడుకలు జరుపుకోవడం ఈ సమయంలో టికెట్ సమస్యలు మరింత ప్రభావితం చేస్తాయి. నిపుణులు పీక్ సీజన్‌లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను పరిశీలించాలి అని సిఫార్సు చేస్తున్నారు.