తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఎండౌమెంట్స్ శాఖ మంత్రి కొండా సురేఖ గృహంలో పోలీసుల దాడి కలకలం రేపింది.
అక్టోబర్ 15న రాత్రి, మంత్రి గృహానికి చేరుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం, మాజీ OSD నందు సుమంత్ ని అవినీతిపై అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది.
ఈ ఘటనలో మంత్రి కుమార్తె కొండా సుష్మిత పోలీసులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసి, అరెస్టుకు వ్యతిరేకంగా నిలిచింది.
ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ కలకలం మొదలైంది. మంత్రి సురేఖ తన OSD అరెస్టు వెనుక CM రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుట్ర ఉన్నారని ఆరోపించారు
మాజీ మంత్రి కొండా మురళి, ఈ సంఘటనపై ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందించారు, తన కుమార్తె సుష్మిత తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి పూర్తి హక్కు ఉందని, తనకు రేవంత్ రెడ్డితో ఎలాంటి వివాదాలు లేవని కూడా స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, గతంలో కొండా సురేఖ చేసిన కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమెపై నేరపూరిత దావా దాఖలయ్యేలా చేశాయి. ఆమె వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి.
ఈ తాజా సంఘటనతో, కొండా సురేఖ రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారారు. ఆమెపై ఉన్న వివిధ ఆరోపణలు, రాజకీయ పరిణామాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.