
బాలీవుడ్ నటి సోనం కపూర్ రెండోసారి గర్భవతి అని అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో కొన్ని ఎలిగెంట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆమె ఈ సంతోష వార్తను అందరితో పంచుకుంది. ఆ ఫోటోల్లో సోనం స్టైలిష్ ఫ్యాషన్‌లో బెబీ బంప్‌ను చూపిస్తూ మెరిసిపోయింది.
ఈ ప్రకటన కోసం సోనం ప్రిన్సెస్ డయానా స్టైల్ ప్రేరణతో తయారైన హాట్ పింక్ సూట్‌ను ధరించింది. క్యాప్షన్‌లో ఆమె ఒకే మాట రాసింది “Mother” అని. దీంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలలో ఆనందం వెల్లివిరిసింది.
ఆమె భర్త ఆనంద్ అహూజా కూడా కామెంట్ చేస్తూ “Double Trouble” అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. సోనం తన స్టోరీలో, “Coming Spring 2026” అంటూ డ్యూ డేట్‌ను కూడా హింట్ ఇచ్చింది.
సోనం–ఆనంద్ దంపతులకు మొదటి సంతానం వాయు 2022 లో జన్మించాడు. ఇప్పుడు రెండో బిడ్డ రానుండడంతో వారి కుటుంబంలో మరింత ఆనందం నెలకొంది. సోనం కపూర్ ఎప్పటిలాగే ఈసారి కూడా తన ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‌ను స్టైలిష్‌గా, ప్రత్యేకంగా చేసింది.
