రైల్వే ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా, భారతీయ రైల్వే బోర్డు త్వరలో కన్‌ఫర్మ్‌డ్ టికెట్లను రద్దు చేయకుండా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నాయి. ఈ కొత్త విధానం IRCTC వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా త్వరలో అమల్లోకి రానుంది.
ప్రస్తుతం ప్రయాణికులు తమ ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే ముందుగా టికెట్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్త టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో రద్దు ఛార్జీలు విధించబడతాయి, ఫలితంగా చాలామంది ప్రయాణికులు డబ్బు కోల్పోతున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, ప్రయాణానికి ముందు టికెట్‌ను రద్దు చేస్తే, రద్దు సమయం మరియు ప్రయాణ తరగతి ఆధారంగా 25% నుంచి 50% వరకు ఛార్జీలు కట్ అవుతాయి.
కొన్ని సందర్భాల్లో మొత్తం టికెట్ ధరనే కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంతేకాక, ప్రయాణికులు రైలు మిస్ చేసినా, లేదా ఏ కారణం వలనైనా సరే, ఉదాహరణకు విమాన ఆలస్యం, చెడు వాతావరణం, అత్యవసర పరిస్థితి వీటి వలన అయితే రీఫండ్‌కు అర్హత ఉండదు.
ఇక కొత్త విధానంలో, ప్రయాణికులు టికెట్ రద్దు చేయకుండా తమ ప్రయాణ తేదీని నేరుగా రీషెడ్యూల్ చేసుకునే అవకాశం పొందుతారు. దీని వల్ల డబ్బు నష్టం లేకుండా సులభంగా ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు.
రైల్వే అధికారులు ఈ సదుపాయం సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఎవరు దీనిని ఉపయోగించుకోవచ్చో, ఎన్ని రోజులు ముందుగా రీషెడ్యూల్ చేయవచ్చో అనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
ప్రయాణికులకి ఇది సంతోషకరమైన వార్త అని చెప్పొచ్చు,ఎందుకంటే ఇది వారి సమయం మరియు డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది, ముఖ్యంగా అనుకోని పరిస్థితుల్లో ప్రయాణ తేదీలు మారినప్పుడు.