Kodali nani and NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మధ్య స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి దూరం కావడం, కొడాలి నాని వైసీపీలోకి వెళ్లడంతో వారిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. కానీ వైసీపీలో ఉన్నా ఎన్టీఆర్ కుటుంబం అంటే కొడాలి నానికి ఇంకా ప్రాణమే. హరికృష్ణ మరణించిన సమయంలో కూడా పార్టీతో సంబంధం లేకుండా కొడాలి నాని దగ్గరుండి అన్నీ పనులు చూసుకున్నారు. హరికృష్ణను అంబులెన్స్‌లో నుంచి దించడం, అంత్యక్రియల సమయంలో పాడె మోయడం చేస్తూ ఆ సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉండి ధైర్యం చెప్పారు.
నానితో ఎన్టీఆర్ తెగదెంపులు
కానీ రానూ రానూ ఎన్టీఆర్ సినిమాల్లో, కొడాలి నాని రాజకీయాల్లోకి బిజీ కావడంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరుగుతూ వచ్చింది. ఇద్దరూ కలిసి కూడా చాలారోజులు అవుతుంది. ఈ క్రమంలో కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య స్నేహంపై తాజాగా డైరెక్టర్ వీవీ వినాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నానితో ఎన్టీఆర్ తెగదెంపులు చేసుకున్నారని తాను అనుకుంటున్నానని, పార్టీలు వారి మధ్య ఉన్న అంతరాన్ని పెంచేశాయని తెలిపారు.
తాను ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సాంబ, అదుర్స్ సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారని, ఎన్టీఆర్, నాని మధ్య మంచి స్నేహం ఉండదని తెలిపారు. కానీ నాని వైసీపీలో చేరడంతో రాజకీయపరమైన వైరుధ్యాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరగిందని వీవీ వినాయక్ చెప్పారు. ఎన్టీఆర్ ఒకసారి స్నేహం చేస్తే ఎవరినీ వదులుకోరని, ఎవరికి ఎక్కడ హద్దులు పెట్టారో తారక్ కు బాగా తెలుసు అని వినాయక్ అన్నాడు.
ప్రస్తుతమైతే కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ బాగా ఉందని తాను అనుకుంటున్నానని, భవిష్యత్తులో మళ్లీ కలుస్తారా? లేదా? అనేది తాను చెప్పలేనని వినాయక్ స్పష్టం చేవారు. అలాగే ఎన్టీఆర్‌తో మీ కాంబినేషనలో చేసినా ఎప్పుడన్న ప్రశ్నకు వినాయక్ ఇప్పుడేం చెప్పలేం అంటూ వ్యాఖ్యానించాడు.భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చూ అంటూ కామెంట్ చేశారు.