Uniki Movie Review: అనేక పోస్ట్ పోన్ మెంట్ల తరువాత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “ఉనికి” సినిమా ఎట్టకేలకు థియేటర్లలో ఈ రోజు జనవరి 21, 2022న గ్రాండ్ గా రిలీజ్ అయింది. కలెక్టర్ పాత్రలో చిత్ర శుక్ల అద్భుతంగా నటించిందంటూ క్రిటిక్స్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమాతో మంచి మెసేజ్ కూడా ఇచ్చారని ప్రేక్షకులు అంటున్నారు. ఈ మూవీకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
కథ
కథ విషయానికి వస్తే.. ఓ పేద కుటుంబంలో పుట్టి పెరిగిన సుబ్బలక్ష్మి (చిత్ర శుక్ల), కష్టపడి ఐఏఎస్ సాధిస్తుంది. గోదావరి జిల్లాల్లో ఆమె పోస్టింగ్ అవుతుంది. సహజంగా ఆమె సిన్సియారిటీకి లోకల్ గూండాల నుంచి బెదిరింపులు ఎదురవుతాయి. ఒక సారి మర్డర్ అటెంప్ట్ కూడా జరుగుతుంది. అయితే చాకచక్యంగా ఆమె తప్పించుకుంటుంది. సుబ్బలక్ష్మి వీరందరిపై తిరగబడ్డానికి డిసైడ్ అవుతుంది. ఆమెకు సహాయంగా పోలీస్ ఆఫిసర్ అభి (ఆశిశ్ గాంధీ). వీరిద్దరూ ఎలా కలిసి ఫైట్ చేస్తారన్నదే ఈ మూవీ కాన్సెప్ట్.
తారాగణం
ఆశిష్ గాందీ, చిత్ర శుక్ల ప్రధాన పాత్రలో నటించారు. స్వర్గీయులు టిఎన్ఆర్, దర్బ అప్పాజి, మహేశ్ ఆచంట మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. పులగం డ్ుయయలియణ, సర్ద శ్యాం కలిసి దీన్ని రచించగా రాజ్ కుమార్ బాబీ దర్శకత్వం వహించారు. రాజేష్ బొబ్బూరి దీన్ని ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని సమకూర్చగా హరికృష్ణ సినిమాటోగ్రఫీని, ఎడిటింగ్ ను హ్యాండిల్ చేశాడు.
ప్లస్ పాయింట్స్
ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. టీఎన్నార్ పాత్రతో ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది. చిత్రశుక్ల నటన అద్భుతంగా ఉంటుంది. ఆశిష్ గాంధీ డైలాగ్ డెలీవరీ సూపర్బ్ గా ఉంది. డైలాగ్సే ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవచ్చు.
నెగిటివ్ పాయింట్స్
నరేషన్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది. సీన్లు అక్కడక్కడా ల్యాగింగ్ గా, మల్టిపుల్ గా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. హీరో ఫ్లాష్ బ్యాక్ లో డెప్త తగ్గింది.
సినిమా ఎలా ఉందంటే?
ఇది కంప్లీట్ గా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచం బెటర్ గా ఉండిఉంటే బాగుండేది. కొన్ని బోరింగ్ సీన్లు ఉన్నాయి. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. ఒకసారి చూడవచ్చు.