Legend Movie: టాలీవుడ్‌ హిస్టరీలో ఈ సంగతి తెలుసా? ఎక్కువ రోజులు ఆడిన మూవీస్‌ ఇవే..!

Legend Movie: ఇప్పుడు రికార్డులు అంటే డబ్బు కలెక్షన్స్‌ మాత్రమేననే అభిప్రాయం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఉంది. అభిమానులు కూడా మా హీరో సినిమా ఎంత డబ్బు వసూలు చేసిందనే టాపిక్‌పైనే డిస్కషన్‌ చేసుకుంటారు. కానీ ఒకప్పుడు ఇలా కాదు.. మూవీ అంటే ఎక్కువ రోజులు ఆడితేనే రికార్డు అని చెప్పుకొనే వారు. ఈ క్రమంలో ఓ దశాబ్ధం కిందటి వరకు ఎక్కువ రోజులు ఆడిన మూవీస్‌నే హిట్‌ సినిమాలుగా చూసేవారు.

ఇప్పుడు ఎంత గొప్ప సినిమా అయినా థియేటర్లలో ఓ వారం లేదా పది రోజులు.. మహా అయితే రెండు వారాలు.. అంతే. ఇక ఎత్తేసి వేరే సినిమాలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులు ఆడితే గొప్ప అన్నట్లు ప్రస్తుతం వ్యవహారం నడుస్తోంది. కానీ ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడిన సినిమాల జాబితా చూస్తే.. మనమే ఇలా ఆదరించామా అనిపించక మానదు. అలాంటి సినిమాలపై ఓ లుక్కేద్దాం..

బాలకృష్ణ నటించిన చిత్రం లెజెండ్‌. 2014లో ఈ మూవీ వచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రొద్దుటూరు అర్వేటిలో 55 రోజులు ఆడాక షిఫ్ట్ అయిన ఈ సినిమా అర్చ‌న థియేట‌ర్లో 1000 రోజులు దాటేసి ఏకంగా 1,116 రోజులు ఆడింది. ఇక రామ్‌ చరణ్‌ నటించిన మగధీర సినిమా విషయానికి వస్తే కర్నూలులో షిఫ్టుల వారీగా వెయ్యి రోజులు ఆడి రికార్డు సృష్టించింది. మహేష్‌ బాబు నటించిన పోకిరి మూవీ 2006లో వచ్చింది. థియేటర్లలో సుమారు 580 రోజులు ఆడి రికార్డు తిరగరాసింది.

ఏడాది పొడవునా ఆడిన సమరసింహారెడ్డి..
బాలయ్య నటించిన సమర సింహారెడ్డి ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డంతో పాటు ప‌లు కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. మంగమ్మ గారి మనవడు సినిమా ఏకంగా 567 రోజులు థియేటర్లో ఆడింది. చిరంజీవి నటించిన ఖైదీ మూవీ 365 రోజులు ఆడింది. మరో చరిత్ర మూవీ 1978లో విడుదలై 556 రోజుల పాటు థియేటర్ల‌లో కంటిన్యూగా ఆడింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం సినిమా 533 రోజుల పాటు ఆడింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ లవకుశ మూవీ ఏకంగా 469 రోజుల పాటు థియేటర్లో ఆడింది.

Similar Articles

Comments

తాజా వార్తల