Comedy Movies: టాలీవుడ్‌లో బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే..!

Comedy Movies: మిగతా కేటగిరీ సినిమాలను పక్కన పెడితే.. కామెడీ సినిమాలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారు. టాలీవుడ్‌లో ప్రతి సినిమాలోనూ కొంచమైనా కామెడీ ఉంటుంది. అందులో బెస్ట్ కామెడీ సినిమాలు ఏంటో చూద్దాం..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమాలో మంచి కామెడీ ఉంటుంది. ఈ సినిమాలో ప్రియదర్శిని తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక కామెడీ సినిమాలకు పెట్టింది పేరు జంధ్యాల అని చెబుతారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన చంటబ్బాయి సినిమాలో కామెడీ ప్రతిఒక్కరినీ కడుపుబ్బా నివ్విస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో బెస్ట్ కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఏప్రిల్ 1 సినిమాలో గోదావరి యాసలో కామెడీ నవ్వులు తెప్పిస్తుంది.

ఎవర్ గ్రీన్ ‘నువ్వు నాకు నచ్చావ్’

అలాగే రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్రప్రసాద్‌తో పాటు ఎల్బీ శ్రీరామ్ కామెడీ భలే ఉంటుంది. ఇక నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమాలోని కామెడీ చూస్తే ఎవరైనా సరే నవ్వకుండా ఉండలేరు. ఇక వెంకటేష్-ఆర్తీ అగర్వాల్ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఇది బెస్ట్ కామెడీ సినిమా అని చెప్పవచ్చు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో వెంటకేష్-సునీల్, వెంకటేష్-బ్రహ్మానందం, వెంకటేష్-ప్రకాశ్ రాజ్ మధ్య ఉండే కామెడీ సీన్లు హైలెట్‌గా ఉంటాయి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా బోర్ అనిపించదు.

ఇక నరేష్ కూడా కామెడీ హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నరేష్ హీరోగా వచ్చిన భళారే చిత్రంలో నరేష్ తో పాటు బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, మహర్షి రాఘవలు తమ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. అలాగే కేతిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మాయాబజార్ సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్, అక్కనేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాలో కామెడీతో పాటు అన్నీ ఉంటాయి.

Similar Articles

Comments

తాజా వార్తల