
ది ఫ్యామిలీ మాన్ సిరీస్ మళ్లీ సీజన్ 3 తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ తన మూడవ సీజన్‌తో ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.
రీసెంట్ గా ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసింది, అది సరదాగా మరియు ఆసక్తికరంగా ఉంది.
ది ఫ్యామిలీ మాన్ సీజన్ 3 నవంబర్ 21, 2025న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త సీజన్‌లో మనోజ్ బాజ్‌పాయీ, సందీప్ కిషన్, నిమ్రత్ కౌర్, జయదీప్ ఆహ్లావత్, , ప్రియమణి, శరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరి, మరియు ఆదిత్య శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సీజన్‌ను రాజ్ & డీకే, సుమన్ కుమార్, మరియు తుషార్ సేత్ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని జయ్ చరోలా నిర్వహించగా, నేపథ్య సంగీతాన్ని కేతన్ సోధా అందించారు. ఈ సిరీస్ రాజ్ & డీకే నిర్మాణంలో తెరకెక్కింది.
