RRR And KGF-2: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2లలో బెస్ట్ సినిమా ఏదంటే..?

RRR And KGF-2: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్-2 సినిమాలు ఇంచుమించుగా, అటుఇటుగా ఒకే సమయంలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. పాన్ ఇండియా సినిమాలుగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాలు విడుదలయ్యాయి. రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి.

కేజీఎఫ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడంతో.. ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో హోప్స్ ఏర్పడ్డాయి. అంSOకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించడంతో.. ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే కొద్దరోజుల గ్యాప్ లో విడుదలైన కేజీఎఫ్-2,ఆర్ఆర్ఆర్ లలో ఏది బెస్ట్ సినిమా అనే చర్చ జరుగుతోంది.

కేజీఎఫ్-2లో ఎమోషనల్ డైలాగ్స్

ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే కేజీఎఫ్-2కి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఆర్ఆర్ఆర్ తో చూసుకుంటే కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇక డైలాగ్స్ విషయంలో కేజీఎఫ్-2 టాప్ లో నిలిచింది. ఇక కేజీఎఫ్-2 పంచ్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ లో పంచ్ డైలాగ్స్ అంతగా లేవు. ఆర్ఆర్ఆర్ లో కంటే కేజీఎఫ్-2లో డైలాగ్స్ ఎమోషనల్ గా ఉంటాయి. రాజమౌళి సినిమా టేకింగ్ పై చూపించిన శ్రద్ధ డైలాగ్స్ పై పెట్టలేదని కనబడుతోంది.

ప్రశాంత నీల్ మాత్రం పంచ్ డైలాగులతో సినిమాకు ప్రత్యేకను చూపిస్తున్నాడు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్, రాజమౌళిలు ఇద్దరూ గొప్పు దర్శకులే. ఎవరికి ఉండాల్సిన ప్లస్ లు వారికి ఉన్నాయి. ఒకరి టేకింగ్ లో నెంబర్ వన్ అయితే.. మరొకరు డైలాగ్స్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కలెక్షన్ల పరంగా, ఇతర అంశాల పరంగా చూసుకుంటే కేజీఎఫ్-2 బెస్ట్ అని అంటున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల