Rashmi Gautam- Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ను చచ్చిపోరా అన్న రష్మీ గౌతమ్!

Rashmi Gautam- Sudigali Sudheer: ప్రముఖ టెలివిజన్ షో ‘జబర్దస్త్’తో చాలా మంది వెలుగులోకి వచ్చారు. సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ లాంటి వారు ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించారు. సుధీర్ తన కామెడీ టైమింగ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సాధించారు. రష్మీ తన మాటలు, చలాకీదనం, అందచందాలతో హీరోయిన్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వీళ్లిద్దరూ కలసి ఈ షోలో చేసే సందడి మామూలుగా ఉండదు. క్యూట్ పెయిర్‌గా వీళ్ల జంటకు పేరుంది.

సుడిగాలి సుధీర్–రష్మీ గౌతమ్ గురించి ప్రేక్షకుల్లో తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ వీటిని వీళ్లిద్దరూ ఖండిస్తూ వచ్చారు. తాము స్నేహితులమని వాళ్లు స్పష్టం చేశారు. అయితే తమ బంధం ఏమిటో బయటకు చెప్పాల్సిన పని లేదని కొంత సందేహతను రేపుతుంటారు. దీంతో వీరి రిలేషన్‌ పై ఎవరికీ క్లారిటీ లేదు.

మళ్లీ మొదలైన రొమాన్స్!

ఇక రీసెంట్‌గా ‘జబర్దస్త్’ షోకు రీఎంట్రీ ఇచ్చిన సుధీర్.. శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సుధీర్ రాకతో రష్మీ గౌతమ్‌లో ఆనందం వెల్లివిరుస్తుంది. మళ్లీ వీళ్లిద్దరూ రొమాన్స్ మొదలుపెట్టారు. బుల్లితెరపై డ్యూయెట్స్ పాడుకుంటున్నారు. ఇటీవల ‘గాలోడు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ టీమ్ తో ‘జబర్దస్త్’ తదుపరి ఎపిసోడ్ జరిగింది. ఇందులో సుధీర్ కు ప్రపోజ్ చేయమని రష్మీకి హీరోయిన్ అంటారు.

అంత మాట అనేసిందా..?

గులాబీ పువ్వు రష్మీకి ఇస్తూ సుధీర్… ‘నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు.. కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా’ అని డైలాగ్ చెప్పాడు. సుధీర్ సంభాషణకు రష్మీ ‘సరే చచ్చిపోరా’ అని పంచ్ వేశారు. దీంతో జడ్జెస్ కృష్ణ భగవాన్, ఇంద్రజ గట్టిగా నవ్వేశారు. అదే సమయంలో ఎంత స్కిట్ అయితే మాత్రం అంత మాట అనేశావేంటని వాపోతున్నారు. ఈ ప్రోమో చూసిన సుధీర్–రష్మి అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల