Radhe Shyam Postponed: ప్రభాస్ అభిమానులకు ఇది చేదు వార్త. సంక్రాంతికి అందరినీ అలరిస్తుందనుకున్న రాధే శ్యామ్ మళ్లీ పోస్ట్ పోన్ అయింది. జనవరి 14న రిలీజ్ అవుతుందనుకున్న అభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడం ప్రారంభించింది. ఎవరూ ఉహించని విధంగా ఈ కొత్త సంవత్సరం 2022లో కూడా మళ్లీ కరోనా ఒమిక్రాన్ రూపంలో పంజా విసరబోతోంది.
రాధే శ్యామ్ మూవీ డైరెక్టర్ Radha Krishna Kumar రాధాకృష్ణ కుమార్ తాజాగా రాధేశ్యామ్ రిలీజ్ పై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సినిమా కరోనా కారణంగా మళ్లీ వాయిదా పడుతున్నట్లు ఆయన పరోక్షంగా పోస్ట చేశారు. “ఈ సమయంలో తమ హృదయాలు చాలా బరువెక్కాయని, అయినా తాము బలంగా నిలబడనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us – Our hopes are always High. Stay safe, stay high – Team #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 4, 2022
రాధే శ్యామ్ సినిమా అతి పెద్ద భారీ బెడ్జెడ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. సుమారు 350 కోట్లు పెట్టి భూషన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు రెడీ చేశారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. జనవరి 14న రిలీజ్ కావాల్సిన రాధే శ్యామ్ మళ్లీ వాయిదా పడింది.
ఇప్పుడున్న అన్ని సినిమాల్లోకెల్లా రాధేశ్యామ్ అత్యంత క్రేజ్ ఉన్న మూవీ. బడ్జెట్ పరంగా “RRR” పెద్ద సినిమా అయినప్పిటికీ ప్రభాస్ రాధేశ్యామ్ కే పాపులారిటీ ఎక్కువ.
రాధేశ్యామ్ సినిమా కథను రాధ కృష్ణకుమార్ రచించి ఆయనే దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తమన్, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీకి వర్క్ చేశారు. 350 కోట్లరూపాయలతో భూషన్ కుమార్ ఈ సినిమాను టీ-సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. ప్రభాస్ జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో నటిస్తాడు, డాక్టర్ పాత్రలో ప్రేరణగా పూజా హెగ్డే, క్రిష్ణంరాజు పరమహంస పాత్రలో కనిపిస్తారు. ట్రయిలర్ లో చూపించినట్లు విక్రమాదిత్యకు జరగబోయేవన్నీ తెలిసిపోతుంటాయి అయితే ఆ సంఘటనల్లో తన ప్రేయసి కూడా దూరమవుతుంది. విక్రమాదిత్య ఏమి చేస్తాడు. అసలు కథ ఎలా మలుపు తిరుగుతుందనే విషయాలను చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారు దర్శకుడు రాధా కృష్ణ కుమార్.
ఇవి కూడా చూడండి: