Unsubscribe Netflix: ప్రభాస్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన నెట్ ఫ్లిక్స్!?

Unsubscribe Netflix: బాహుబలి సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని తన నటనతో ప్రపంచానికి చాటి చెప్పిన నటుడుగా ప్రభాస్ ని చెప్పుకోవచ్చు . ఇక తెలుగు చిత్ర సీమ అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది బాహుబలి. ఈ చిత్రంతో ప్రభాస్ ఫ్యాన్ బేస్ ప్రపంచ వ్యాప్తంగా బాగానే పెరిగింది.

 

అయితే తన తర్వాతి సినిమాలు కూడా అదే విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు ప్రభాస్. అయితే బాహుబలి తర్వాత విడుదలైన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కథ బాగానే ఉన్నా తెరకెక్కించే విధానంలో దర్శకులు విఫలమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత విడుదలైన సాహో సినిమాపై నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ ఖ్యాతిని తగ్గించేలా కామెంట్ చేసింది. అయితే సాహో కి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ కాము నీందా ఇనీ అక్సి అపా? అని రాసుకొచ్చింది. అంటే ఇదేమి యాక్షన్ అని అర్ధం. ఇక ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫాన్స్ ఊరుకుంటారా? తమదైన శైలిలో నెట్ ఫ్లిక్స్ పై విమ్మర్శలు గుప్పిస్తున్నారు. ఈ నెట్ ఫ్లిక్స్ ని వెంటనే అన్ సబ్స్క్రయిబ్ చేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ నెట్ ఫ్లిక్స్ ని తప్పించే సమయం వచ్చింది. పిల్లలను చెడగొట్టే సినిమాలను వెబ్ సిరీస్లను తీసుకువస్తున్న ఈ నెట్ ఫ్లిక్స్ ను సబ్స్క్రయిబ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇంత పెద్ద స్టార్ ని కామెంట్ చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు.ఇక ఈ కామెంట్స్ పై నెట్ ఫ్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Similar Articles

Comments

తాజా వార్తల