Nikhil Divorce: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ విడాకులు..? క్లారిటీ

Nikhil Divorce: యంగ్ హీరో నిఖిల్.. చాలా తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కు దగ్గర అయ్యారు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు నిఖిల్. ఇక మొదటి సినిమానే మంచి ఎనేర్జిటిక్ క్యారెక్టర్ అవడంతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. తన పర్ఫామెన్స్ తో జూనియర్ మాస్ మహారాజ గా పేరు పొందారు నిఖిల్.

కార్తికేయ తో మంచి పేరు..
నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పిన మూవీగా “కార్తికేయ” నిలిచింది. ఇక ఆ సినిమా సీక్వెల్ తో ఇటీవల కార్తికేయ-2 గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇలా కార్తికేయ-2 ఇతర భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. దానితో దేశంలోని ఇతర ఇండస్ట్రీలో కూడా నిఖిల్ మంచి పేరు సంపాదించాడు.

అయితే నిఖిల్ పర్సనల్ కెరీర్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. పల్లవి అనే అమ్మాయిని నిఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పల్లవి తన ఫ్రెండే. ఇక అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో సమస్యలు వచ్చాయని.. వారు విడిపోవడానికి సిద్దమయ్యారని వార్త వైరల్ అవుతుంది. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా చాలానే చర్చ జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో.. వాళ్ళు దూరమవ్వడానికే పిల్లలకు దూరంగా ఉన్నారని టాక్ నడిచింది.

ఈ వార్తలకు నిఖిల్ చెక్ పెట్టేసాడు. ఇటీవల తాను తన భార్య పల్లవి వర్మ కలిసి ఉన్న ఫోటో ను షేర్ చేసాడు. దానితో “నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి నాకు ఏదో తెలియని కొత్త ఫీలింగ్ ..అద్భుతంగా ఉంటుంది” అని టాగ్ చేసారు. దీనితో వాళ్ళ విడాకుల వార్తలకు చెక్ పెట్టాడు నిఖిల్. కాగా ఈ విషయానికి దీనితో ఫుల్ స్టాప్ పడింది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Similar Articles

Comments

తాజా వార్తల