Nagasourya Marriage: టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్ళికి రెడీ.. అమ్మాయి కన్ ఫర్మ్..!?

Nagasourya Marriage: ఒక్కొక్కరుగా వరుసగా పెళ్లిళ్లకు లైన్ కట్టేసారు సినీ స్టార్లు. బాలీవుడ్ స్టార్లు.. కత్రినా, అలియా భట్, కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి,.. ఇలా అన్ని ఇండస్ట్రీలలోని స్టార్లు అందరు.. ఒక్కొక్కరిగా ఓ ఇంటివారై పోతున్నారు. ఇక ఈ మధ్యలో కోలీవుడ్ స్టార్ విశాల్ తన పెళ్లి వార్తలకు తెరదించి, ప్రకటన చేసాడు. ఇక తాను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు పూర్తి అవ్వగానే.. ప్రేమ పెళ్లి చేసుకోనున్నట్టు తెలిపాడు.

ఇలా ఒక్కొక్క హీరో పెళ్లి పీటలు ఎక్కుతున్న తరుణంలో.. ప్రస్తుతం ఓ టాలీవుడ్ యంగ్ హీరో పెళ్ళికి సంబంధించిన వార్తలు చర్చకు వస్తున్నాయి. అతను మరెవరో కాదు.. హీరో నాగశౌర్య. క్రికెట్ గర్ల్ అండ్ బీర్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగశౌర్య.. చాలా సినిమాలే చేసాడు. కానీ అవి అంతగా పేరు తీసుకురాలేదు. రాశిఖన్నా తో చేసిన “ఊహలు గుసగుసలాడే” సినిమా అయితే మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. అలా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక నేషనల్ క్రష్ రశ్మికతో చేసిన “ఛలో” మూవీ నాగశౌర్యకు మంచి పేరు, హిట్ అందించింది. ఇక ఇటీవల “కృష్ణ వ్రింద విహారి” సినిమాతో మంచి హిట్టే అందుకున్నాడు.

అయితే ఇటీవల ఈ యంగ్ హీరో పెళ్ళికి సంబంధించిన వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నాగశౌర్య తన సొంత మరదలు నే వివాహం చేసుకుంటాడు అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. నాగశౌర్య తన సొంత మరదలు అనూషను వివాహమాడడానికి సిద్ధమయ్యాడని.. దానికి సంబంధించిన ముహుర్తాలు కూడా ఖరారయ్యాయని గుసగుసలు వినబడుతున్నాయి. అంతే కాదు తన వెడ్డింగ్ కార్డు ఇదే అని సోషల్ మీడియాలో ఓ ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది.

ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ప్రకారం.. 19న మెహేంది.. మరియు 20వ తేదీన నాగశౌర్య – అనూషల పెళ్లి బెంగళూరులో జరుగబోతున్నట్లు వార్త వైరల్ అవుతోంది. 20వ తేదీన ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ముహూర్థం. అయితే ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియరాలేదు. పెళ్లి కార్డు వైరల్ అవుతుండటంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై నాగశౌర్య గానీ, సంబంధీకులు గానీ ఏవిధముగాను స్పందించలేదు. ఇక ఎవరో ఒకరు ఆఫీషియల్ గా స్పందిస్తే గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Similar Articles

Comments

తాజా వార్తల