Naga Chaitanya: హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య.. నాలుగేళ్లలోనే తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లు ఎందుకు విడిపోయారనే విషయంపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరూ తమ తమ కెరీర్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ.. వాళ్ల పర్సనల్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని, వారిద్దరూ తరచుగా వెకేషన్స్‌కి వెళుతున్నారనే ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడని, శోభితను వివాహం చేసుకోవాలని చైతూ ఫిక్సయినట్లు వార్తలు వచ్చాయి. ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నారని టాక్ నడిచింది. అయితే దీనిపై అటు నాగ చైతన్య ఇటు శోభిత ఇద్దరు కూడా వ్యక్తిగతంగా స్పందించలేదు. అయితే చైతూ టీమ్ మాత్రం ఆ వార్తలను ఖండించింది.
Naga Chaitanya: శోభితతో చైతూ ఫొటో వైరల్
తాజాగా శోభితతో కలిసున్న నాగచైతన్య ఫోటో ఒకటి నెట్టింట లీక్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనడానికి ఈ ఫోటోనే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోని నిశితంగా పరిశీలిస్తే అది మార్ఫింగ్ అని స్పష్టమవుతోంది. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫోటోలను ఒక్క చోట చేర్చి ఎవరో కావాలనే స్ప్రెడ్ చేశారని తెలుస్తోంది.
మరోవైపు నిప్పులేనిదే పొగ రాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ ప్రమోషన్స్‌లో ‘శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?’అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నాగ చైతన్య చిన్న స్మైల్ ఇచ్చి సమాధానం దాటవేశారు. అలాగే ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగ్గా హ్యాపీ స్టేటస్ అంటూ బదులిచ్చారు. దీన్ని బట్టి శోభితతో రిలేషన్‌ను చైతూ ఖండించలేదని పలువురు అంటున్నారు.