
ఇటీవల మౌగ్లీ సినిమా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
మౌగ్లీ సినిమా జనవరి 01, 2025 నుంచి ETV Win వేదికగా స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రంలో రోషన్ కనకాల, సాక్షి మ్హడోల్కర్, బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా, కాల భైరవ సంగీతం అందించారు. రామ మరుతి ఎం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, టీజీ విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.
