Mana Shankaravaraprasad Garu OTT Release: OTT లో విడుదల కాబోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఏడాది మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. గత కొన్ని సంవత్సరాలుగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సినిమా భారీ ఆనందాన్ని ఇచ్చింది.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఐదు పెద్ద సినిమాల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి ఏకగ్రీవంగా హిట్ టాక్ రావడంతో, సంక్రాంతి విజేతగా నిలిచింది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది.

Mana Shankaravaraprasad Garu OTT Release

ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 న ఈ సినిమా ఒకేసారి ఓటీటీ ప్రీమియర్‌తో పాటు టీవీల్లో కూడా ప్రీమియర్ కానుంది. కుటుంబ ప్రేక్షకుల వరకు సినిమా మరింత విస్తృతంగా చేరనుంది.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటి, నయనతార, హర్షవర్ధన్, క్యాథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను అనిల్ రావిపూడి రచన-దర్శకత్వంలో తెరకెక్కించగా, సాహు గారపాటి మరియు సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఓటీటీ విడుదల తేదీ ఖరారవడంతో, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం జీ5లో కూడా మంచి వ్యూయర్‌షిప్‌ను సాధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల