Mahesh Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు అప్డేట్లు, వివరాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. కథ చెక్కడంలో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో మహేష్-రాజమౌళి చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత చేపట్టబోతున్న మూవీ కావడంతో రాజమౌళి, మహేష్ ఫ్యాన్స్‌లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ కాంబోలో మూవీ చేస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే మహేష్ బాబు బయట పడి తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చిత్ర బృందం మేలు కోరుతూ త్వరగానే మహేష్ బాబు రికవరీ అయ్యారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Rajamouli: తీపి కబురు.. పండగ చేసుకొనేలా..
ఈ నేపథ్యంలో రాజమౌళి, మహేష్ చిత్రంపై తాజా అప్డేట్ ఒకటి ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇప్పుడు పండగ చేసుకొనేలా చేస్తున్నాయి. మహేష్‌తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా పూర్తవుతోందని విజయేంద్ర ప్రసాద్చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మహేష్‌బాబు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే అడ్వెంచర్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లను తెప్పిస్తున్నట్లు సమాచారం.