Rajamouli & Mahesh Babu: మహేష్ బాబును మరిన్ని ఉన్నత శిఖరాలు ఎక్కించనున్న రాజమౌళి?

Rajamouli & Mahesh Babu: ఇటీవల మాతృ వియోగంతో బాధలో ఉన్న మహేష్ బాబు.. అంతకు ముందు “సర్కారు వారి పాట” తో మెప్పించాడు. అయితే ప్రస్తుతం మహేష్ చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాగా, రెండవది దర్శక ధీరుడు రాజమౌళి తో. ఇప్పుడిప్పుడే మాతృ వియోగ వేదన నుండి బయటికి వస్తున్న మహేష్.. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. ఇక దీనితో పాటు ఈ సినిమా తరువాత రాజమౌళితో చేయనున్న సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి.

maheshbabu-with-rajamouli

అయితే రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా.. RRR మరియు బాహుబలి కంటే ఈ ప్రాజెక్ట్ పెద్దదని మరియు గ్లోబ్‌ ట్రాటింగ్ అనే పదాన్ని కూడా ఉపయోగించడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. రాజమౌళి మహేష్ కోసం ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్ లో ఓ పవర్ ఫుల్ కథను తెరకెక్కిస్తున్న సంగతి ఇది వరకే తెలుసు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మరియు యదార్ధ సంఘటనల నుండి స్పూర్తి పొంది ఈ కథ రూపొందించారని ఫిల్మ్ వర్గాల టాక్.

ఇక ఈ సినిమాతో ఇప్పటికే సూపర్ స్టార్ గా ఉన్న మహేష్.. మరింత క్రేజ్ పొందడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలే దర్శక ధీరుడు జక్కన్న తన సినిమాలో పాత్రలను ఒక రకంగా ఎలివేట్ చేస్తాడు. అందులోనూ మహేష్ బాబు వంటి స్టార్ హీరోను ఏ రేంజ్ లో చూపిస్తాడా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. రాజమౌళిపై భారీగా నమ్మకం పెట్టుకున్న అభిమానులు.. ఇప్పటికే సినిమా రేంజ్ గురించి ఒక లెవల్ లో మాట్లాడుకుంటున్నారు.

మహేష్ త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే.. రాజమౌళి రంగంలోకి దిగుతారని.. ఇక షూటింగ్ కూడా శరవేగంగా సాగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సంచలన యాక్షన్ సీన్లతో మహేష్ హీరోయిజాన్ని, మహేష్ బాబును కొత్త శిఖరాలకు చేరుస్తాడని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా దీపికా పదుకొనె ను తీసుకోవాలని ప్లానింగ్ జరుగుతున్నట్టు పుకార్లు వస్తున్నాయి.

Similar Articles

Comments

తాజా వార్తల