
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి వంటి తారలతో రూపొందిన “కాంత” చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
థియేట్రికల్ రన్ పూర్తయ్యాక, ఇప్పుడు ఈ చిత్రం OTTలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. కాంత సినిమా డిసెంబర్ 12, 2025న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భవ్యశ్రీ బోర్స్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించారు. జాను చంతర్ సంగీతం సమకూర్చగా, ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, ఓమ్ వర్గీస్ నిర్మించారు.
