Heroins: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం. ఇక్కడ ఒక్క సినిమా హిట్ అయితే చాలు నటీనటుల జాతకం ఒక్కరోజులో మారిపోతుంది. అప్పటివరకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే వాళ్లు కూడా కోట్లలో డిమాండ్ చేస్తారు. నిర్మాతలు కూడా వారి డేట్లు దొరికితే చాలు అన్నట్లుగా ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమకంటూ ఓ స్టార్ డమ్ సాధించుకున్న హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. ఒకప్పుడు బీదరికంతో ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్లు.. ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.
అనుష్క శెట్టి
యోగా టీచర్‌గా కెరీర్ ఆరంభించిన అనుష్క శెట్టి చాలా సాధారణ కుటుంబంలో పుట్టింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో తొలుత చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చింది. క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించింది. అరుంధతి సినిమాతో ఆమె స్టార్‌డమ్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆమె మారిపోయింది. ఒకానొక సమయంలో సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా పేరుగడించింది. ఇప్పుడు సినిమాలు తగ్గించనప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.
నయనతార
సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చేతిలో పది రూపాయలు లేకుండా అల్లాడిన రోజులు గడిపానని నయనతార అనేక సార్లు చెప్పింది. ఇప్పుడు ఆమె లేడీ సూపర్‌స్టార్‌గా మారిపోయింది. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఆమె కొన్ని వందల కోట్లకు అధిపతి. పెళ్లి తర్వాత కూడా ఆమె జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.
తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అగ్ర హీరోలందరి చెంత నటించింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటోంది. ఆమె ముంబై, హైదరాబాద్, చెన్నైలలో సొంత ఇళ్లను కొనుగోలు చేసింది. పలు రకాల బిజినెస్‌లలో పెట్టుబడులు కూడా పెడుతోంది. ఇటీవల ఆమె కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ కూడా జరిగాయి.
సమంత
సమంత లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. ఇప్పుడు హార్డ్ వర్క్‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నాగచైతన్యతో విడాకుల వల్ల జీవితంలో కొద్దిగా డిస్ట్రబెన్సస్ ఎదురైనప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతోంది. ఇప్పుడు ఆమె పేరిట కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి. అదే సమయంలో ఛారిటీలకు సేవలందిస్తూ తన మంచి మనసును చాటుకుంటోంది.
రష్మిక
తన నాన్న ఇంటి అద్దె కూడా కట్టలేక అనేక ఇళ్లు మారాల్సి వచ్చిందని రష్మిక ఓ ఇంటర్వ్యూలో చాలా బాధపడింది. ఒక్కోసారి తినడానికి తిండి కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చింది. ఈమె ఛలో సినిమాతో సైలెంట్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. పుష్ప సినిమా తర్వాత నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్‌లో ఈమెదే అగ్రస్థానం అనడంలో అతిశయోక్తి లేదు. కోట్లలో ఆస్తులను కూడబెడుతోంది.