UV Creations: ప్రభాస్ సంస్థ యూవీ క్రియేషన్స్ పై జీఎస్టీ అధికారుల దాడులు.. ఎందుకంటే.. !

UV Creations: బాహుబలి సినిమాతో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హోదా దక్కింది. బాహుబలి, బాహుబలి 2 సినిమాలు బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేశాయి. అప్పటి వరకు ఒక లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లు పరిస్థితి మారిపోయింది. నాన్ బాహుబలి రికార్డులు అనే పదం అప్పటి నుంచే మొదలైంది. అంతలా తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.

prabhas UV creations

ఇండస్ట్రీలో అనేక నిర్మాణ సంస్థలు పేరు గాంచాయి. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అంతకు ముందే ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అతని ఫ్రెండ్స్ సంయుక్తంగా యూవీ క్రియేషన్స్ పేరిట నిర్మాణ సంస్థను 2013లో నెలకొల్పారు. యూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మొట్ట మొదటగా ప్రభాస్.. డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో మిర్చి సినిమాను నిర్మించారు. తర్వాత అనేక చిత్రాలను ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను ఈ బ్యానర్ లో నిర్మించారు.

తాజాగా యూవీ క్రియేషన్స్ సంస్థపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ లో ఉన్న యూవీ క్రియేషన్స్ సంస్థ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో జనంలో విస్తృత చర్చ నడిచింది. ప్రభాస్ కు చెందిన సంస్థను ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ సర్వత్రా ఏర్పడింది.

యువీ క్రియేషన్ మీద జీఎస్టీ అధికారులు ఎందుకు దాడి చేశారనే స్పష్టత ఇదే..

యూవీ క్రియేషన్స్ పై జీఎస్టీ దాడుల నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఈ నిర్మాణ సంస్థ పొందుతున్న లాభాలకు, వారు చెల్లిస్తున్న జీఎస్టీ ట్యాక్స్ కు భారీగా వ్యత్యాసం ఉంటోందట. అందుకే దాడులు చేశామని అధికారులు వివరణ ఇచ్చారు. సోదాల్లో భాగంగా యూవీ నిర్మాణ సంస్థ సుమారు 6 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించలేదని గుర్తించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతామని జీఎస్టీ అధికారులు వెల్లడించారు.

Similar Articles

Comments

తాజా వార్తల