గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ లేటెస్ట్ అప్‌డేట్ – టికెట్లు, ఎంట్రీ రూల్స్ వివరాలు

Globetrotter Event Latest Update – Ticket and Entry Rules Details

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం తాత్కాలిక టైటిల్ “SSMB 29” కు సంబంధించిన “గ్లోబ్‌ట్రాటర్” భారీ ఈవెంట్‌ నవంబర్ 15 న రామోజీ ఫిలిం సిటీలో జరుగనుంది.

ఆ ఈవెంట్ కి సంబందించిన తాజా సమాచారం వెలువడింది. ఈ ఈవెంట్‌ టికెట్లపై మరియు సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్లపై రాజమౌళి స్వయంగా వీడియో రిలీజ్‌ చేసి అభిమానులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌ నవంబర్‌ 15న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. రాజమౌళి వీడియోలో “పాస్‌ లేకపోతే ఎంట్రీ లేదు” అని కచ్చితంగా చెప్పారు.

ఈ ఈవెంట్‌కు ప్రవేశం కోసం ప్రత్యేకంగా క్యూ ఆర్‌ కోడ్‌ కలిగిన పాసులు తప్పనిసరి. ప్రతి అభిమాని తన ఒరిజినల్‌ ఐడి మరియు పాస్‌ తీసుకురావాలని సూచించారు. మధ్యలో గేట్లు మూసివేయబడతాయని, ఎవరికీ ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వబడదని తెలిపారు.

ఈవెంట్‌లో 50,000 మందికి పైగా అభిమానులు హాజరుకావచ్చని అంచనా. అందువల్ల భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. రాజమౌళి వీడియో లో, విజవాడ నుంచి వచ్చేవాళ్ళు, రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ వద్ద దిగకుండా ముందు గానే గానే దిగి వెనక గేట్ నుంచి రావాలని సూచించారు. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ మొత్తం మూసివేయబడుతుంది అని చెప్పారు.

ఈ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్‌, పృథ్విరాజ్ సుకుమారన్‌ తదితరులు పాల్గొననున్నారు. ఈవెంట్‌లో టైటిల్ రివీల్‌, మూడు నిమిషాల టీజర్‌, మరియు లైవ్ పెర్ఫార్మెన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి అని సమాచారం. ఈ ఈవెంట్‌ను దేశంలోనే అతిపెద్ద 130 అడుగుల ఎత్తు స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. మరియు ఈ ఈవెంట్ లైవ్ జిఓహాట్స్టార్లో ప్రసారం కానుంది.

టికెట్‌ వివరాల విషయానికొస్తే, అధికారిక లింక్‌ ద్వారా మాత్రమే పాసులు బుక్‌ చేసుకోవాలని అభిమానులను హెచ్చరించారు. ఫేక్‌ టికెట్లకు బలి కాకూడదని సూచించారు.

సినీ ఇండస్ట్రీలోనే అతిపెద్ద ఈవెంట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వేడుకలో రాజమౌళి టీమ్‌ అభిమానులకు మరపురాని అనుభూతి ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. భద్రతా నియమాలను పాటిస్తూ, అధికారిక పాస్‌లతో మాత్రమే హాజరుకావాలని ఆర్గనైజర్లు మరోసారి సూచించారు.

Similar Articles

Comments

తాజా వార్తల