Venkatesh: విక్టరీ వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు వేస్తూ ప్రతి తెలుగింటి వ్యక్తికీ తెలిసిన ముఖంగా వెంకటేష్ గుర్తింపు పొందారు. దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకడిగా రాణిస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా చేసిన ఓరిదేవుడి మూవీలో గెస్ట్ అప్పియర్స్ ఇచ్చాడు వెంకటేష్.
దీంతోపాటు ఇటీవల దృశ్యం-2, ఎఫ్-3 మూవీస్ చేశాడు వెంకటేష్. సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారనే పేరు వెంకటేష్ సొంతం చేసుకున్నారు. ఇక వెంకటేష్‌పై ఇప్పుడు ఓ సంచలన వార్త హల్ చల్ చేస్తోంది. దగ్గుబాటి వెంకటేష్ త్వరలో సినిమాలకు దూరం కానున్నాడనేది ఆ పుకార్ల సారాంశం. సీనియర్ హీరోగా తనకంటే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఇలా ఎందుకు చేస్తున్నాడనే ఆలోచన ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.
తాజాగా వెంకటేష్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేశాక సినిమాలకు విరామం ప్రకటించాలనే ఉద్దేశంలో ఉన్నాడని టాక్ నడుస్తోంది. అందుకే తదుపరి ప్రాజెక్టులను అంగీకరించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నఫళంగా సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు వెంకటేష్ కాస్త ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అధికారికమా.. గాసిప్పేనా?
ఆధ్యాత్మికంగా దారి మళ్లించుకొనేందుకే కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా ఫ్యూచర్ ప్లాన్స్‌పై సంతకాలు చేయడం లేదట వెంకటేష్. దీంతో విక్టరీ వెంకటేష్ విరామం కన్ఫం అంటూ సినీ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆధ్యాత్మికంగా కొన్ని రోజులు గడిపిన తర్వాత మళ్లి సినిమాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ నిర్ణయం అధికారికంగా తీసుకున్నారా లేక గాసిప్స్ మాత్రమేనా అనేద తేలాల్సి ఉంది.