
యువ నటుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’ విడుదలకు ముందే OTT రైట్స్ సొంతం చేసుకుంది.
ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం.
తాజా రిపోర్ట్స్ ప్రకారం, ‘ఛాంపియన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన సుమారు నాలుగు వారాల తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రోషన్ మేకా లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆయన డాషింగ్, హ్యాండ్సమ్ అవతార్‌లో కనిపించడం సినిమాపై అంచనాలను పెంచింది. మరోవైపు, ప్రముఖ మలయాళ నటి అనస్వర రాజన్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టడం మరో విశేషం.
సినిమా విడుదలకు ముందే చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా బాగా చేసింది. ఛాంపియన్’ థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
