బాలీవుడ్ హీ-మ్యాన్ ధర్మేంద్ర కన్నుమూత: 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస

Bollywood’s He-Man Dharmendra passes away:

బాలీవుడ్‌కు “హీ-మ్యాన్”గా ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర ఇక మన మధ్య లేరు. నవంబర్ 24, సోమవారం ఆయన కన్నుమూశారు. 89 సంవత్సరాల వయస్సులో, ముంబై జూహూలోని తన నివాసంలోనే ధర్మేంద్ర చివరి శ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని తెలిసింది.

నవంబర్ 12న, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆయనను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుండి ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతూ ఉన్నారు.

అంత్యక్రియలకు డియోల్ కుటుంబం మొత్తం, అలాగే అనేక సినీ ప్రముఖులు హాజరయ్యారు హేమా మాలిని, ఈషా దియోల్, సన్నీ దియోల్, బాబీ దియోల్, అమితాబ్ బచ్చన్ తదితరులు కన్నీటి కళ్లతో చివరి వీడ్కోలు ఇచ్చారు. ఆయనకు పెద్ద కుమారుడు సన్నీ డియోల్ చితికి నిప్పు పెట్టినట్లు సమాచారం.

Similar Articles

Comments

తాజా వార్తల