Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ లో సీక్రెట్ రూమ్ ఎపిసోడ్.. గీతూని పంపిన బిగ్ బాస్..

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ఆసక్తికరంగా సాగుతోంది. ఆద్యంతం కంటెస్టెంట్ల ఆటతీరు, టాస్క్ లు ఊహకందని రీతిలో ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొద్ది వారాల నుంచి బిగ్ బాస్ ఊహాకందని రీతిలో దూసుకెళ్తోంది. ఎలిమినేషన్స్ సైతం అదే మాదిరిగా జరుగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు వారాల్లో అర్జున్ కల్యాణ్ – సూర్య వంటి టాప్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యది ఎలిమినేషన్ కాదని, అతడిని రహస్య గదిలోకి తరలిస్తారని అంతా భావించారు. అయితే, అలా జరగలేదు.

మరోవైపు ఈ సీజన్ లో సీక్రెట్ గది ఉందా? లేదా? అనే అనుమానాలు అందరికీ ఏర్పడ్డాయి. గతంలో జరిగిన సీజన్ లోనూ సీక్రెట్ గదిలో ఏ కంటెస్టెంట్ ని కూడా బిగ్ బాస్ పంపింది లేదు. ఇక టీవీ చూసే ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియా ఆడియన్స్ సైతం సీక్రెట్ గదికి ఎవరిని పంపుతారా అని చాలా కాలంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ వారం సీక్రెట్ గదిలోకి ఓ ఇంటి సభ్యుడిని పంపేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గీతూనే పంపుతారా?

హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న గీతూ రాయల్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపబోతున్నట్లు సమాచారం. ఆమె ఎలిమినేషన్ అయినట్లుగా కంటెస్టెంట్లను నమ్మించేందుకు రహస్య గదికి పంపబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో ఇచ్చే టాస్క్ లలో గీతూ ఎప్పుడూ వెరైటీ కోరుకుంటోంది. దాంతో ఈమెకు ఇది సరైన టాస్క్ అంటూ ఆడియన్స్ చెబుతున్నారు. కాగా, హోస్ట్ నాగార్జున నుంచి గీతూకు బాగా చీవాట్లు పడినట్లు సమాచారం.

గేమ్ లో భాగంగా బాలాదిత్య బలహీనత నేపథ్యంలో గీతూ చాలా చెత్తగా వ్యవహరించిందని, అందుకే కింగ్ నాగ్ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. నాగ్ మందలింపు ఒక్క గీతూతోనే ఆగిపోలేదు. ఈ వారం ఇంటి సభ్యుల్లో లైన్ దాటిన అందరికీ క్లాస్ పీకాడట నాగ్. ఇక జరగబోయే ఎపిసోడ్ లలో మరింత రసవత్తరంగా సాగుతుందనే సంకేతం బిగ్ బాస్ పంపాడు.

Similar Articles

Comments

తాజా వార్తల