
యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్ నుంచి, ధూమ్ 4 రాబోతుంది, అయితే ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు సమాచారం.
ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం యశ్‌రాజ్ ఫిల్మ్స్ (YRF) సంస్థతో తలెత్తిన సృజనాత్మక విభేదాలేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
తాజా నివేదికల ప్రకారం, ధూమ్ 4 కథ, దాని దిశ, మరియు ప్రెజెంటేషన్‌పై ముఖర్జీకి పూర్తి స్వేచ్ఛ లేకపోవడం ఆయనకు నచ్చలేదట. కానీ ఈ ప్రాజెక్ట్‌లో ఆయన ఆలోచనలకు తగిన స్థానం ఇవ్వలేదని చెప్తున్నారు. దీనితోనే ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రం కోసం మొదటగా రణబీర్ కపూర్ పేరు చర్చలో ఉంది. అయాన్-రణబీర్ కాంబినేషన్ ఇప్పటికే బ్రహ్మాస్త్ర చేసారు మరియు అది మంచి విజయం సాధించింది.
అందుకే ఈ జోడీ ధూమ్ 4లో మరోసారి కలిసి పనిచేయబోతుందని అభిమానులు ఆశించారు. కానీ అయాన్ వైదొలిగిన తర్వాత, రణబీర్ కూడా ఈ ప్రాజెక్ట్‌తో ఉంటాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కొనసాగుతుంది. అయితే కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు సమాచారం.
అలాగే కథలో మార్పులు చేయాలా అనే అంశం కూడా చర్చలో ఉందని చెబుతున్నారు. ధూమ్ ఫ్రాంచైజీకి ఎప్పటినుంచీ స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, గ్లామర్ అంశాలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి దర్శకుడు మార్పుతో కొత్త దిశలో సినిమా వెళ్ళే అవకాశం ఉంది.
ధూమ్ 4 నుండి తప్పుకున్న తర్వాత అయాన్ ముఖర్జీ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర: పార్ట్ టూ – దేవ్ పై దృష్టి సారిస్తున్నారని సమాచారం.
ఆయన ఈ ఫ్రాంచైజీని మరింత విస్తరించి, విజువల్ యూనివర్స్‌గా మార్చే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం.
ఇప్పుడు అందరి దృష్టి యశ్‌రాజ్ ఫిల్మ్స్ తదుపరి నిర్ణయంపైనే ఉంది. ధూమ్ 4కి కొత్త దర్శకుడు ఎవరు? కథలో మార్పులు ఉంటాయా? రణబీర్ కపూర్ ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగుతారా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రానుంది. మరోవైపు అయాన్ తన బ్రహ్మాస్త్ర 2 పనులను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.
