Anitha Chowdary: పెళ్లి చేసుకోమని శ్రీకాంత్ టార్చర్ పెట్టాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్

Anitha Chowdary: ఒకప్పటి యాంకర్ అనిత చౌదరి గురించి అందరికీ తెలిసిందే. తెలుగు బుల్లితెరపై హోమ్‌లీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ స్క్రీన్‌పై కూడా అలరించింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే పలు సీరియల్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని బుల్లితెరకు, వెండితెరకు పూర్తిగా దూరమైంది.

అయితే తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిత చౌదరి సంచలన విషయాలు బయటపెట్టింది. తన పెళ్లికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. హీరో శ్రీకాంత్ తన కజిన్ కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిత చౌదరి చెప్పుకొచ్చింది. హీరో శ్రీకాంత్ తనకు రోజూ ఫోన్ చేసి కృష్ణ చైతన్యను పెళ్లి చేసుకోవాల్సిందిగా చెప్పేవాడని, అతడిని పెళ్లి చేసుకోవాలని బాగా టార్చర్ పెట్టాడని చెప్పింది.

రోజూ శ్రీకాంత్ ఫోన్ చేసి బలవంతపెట్టేవాడు

శ్రీకాంత్ టార్చర్ బాగా ఎక్కువ కావడంతో మూడు సంవత్సరాలు కృష్ణ చైతన్యతో మాట్లాడలేదని అనిత చౌదరి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కృష్ణ చైతన్య వచ్చి ప్రపొజ్ చేశాడని, అప్పుడు అతడితో పెళ్లికి ఒప్పుకున్నట్లు అనిత చౌదరి ఓ ఇంటర్వ్యూలో తన లవ్ మ్యారేజ్ వివరాలను బయటపెట్టింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నానని, పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానంటూ చెప్పుుకొచ్చింది.

కానీ కృష్ణ చైతన్యను కలిసి తర్వాత, అతడితో పరిచయం బాగా పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి పెరిగిందని అనిత చౌదరి ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే కృష్ణచైతన్య అమెరికాలో ఉండటంతో అతడిని పెళ్లి చేసుకుంటే అమెరికా వెళ్లాల్సి వస్తుందని, ఇక్కడ తన కుటుంబం ఒంటరి అయిపోతుందని అనిపించిందన్నారు. అందుకే తొలుత అతడితో పెళ్లికి నిరాకరించినట్లు తెలిసింది. పెళ్లి చేసుకోకూదని బలంగా అనుకున్నానని, అప్పుడు శ్రీకాంత్ రోజూ ఫోన్ చేసేవాడని అనిత చౌదరి పేర్కొంది.ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Similar Articles

Comments

తాజా వార్తల