Anchor Anitha Chowdary: స్టార్ హీరోను “ఒరేయ్” అనే సరికి హర్ట్ అయిపోయాడు: అనిత

Anchor Anitha Chowdary: యాంకర్ అనితా చౌదరి.. తొంబైల్లో యాంకర్ గా పనిచేసి పాపులర్ అయ్యి పరిచయం అవసరం లేనంతగా పేరు సంపాదించింది. టీవీ యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. ఇక ఈటీవీలో అయితే చాలా కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. కొన్ని రోజులకు చేసిన మంజుల నాయుడు గారి సీరియల్ కస్తూరి ద్వారా ఎంతగానో గుర్తింపు పొందారు. దాని తర్వాత బుతురాగాలు, నాన్న మొదలైన వాటితో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అయ్యింది అనిత.

ఆ తర్వాత చాలా రోజులు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా చాలానే సినిమాల్లోనే నటించింది అనిత. కానీ ఈ మధ్య కాలంలో బుల్లితెర, వెండితెర రెండిటికీ దూరంగా ఉంటూ.. తెలుగు ప్రేక్షకులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా దూరంగా ఉన్న అనిత గారు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ సంబంధిత కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం వాటిల్లో ఓ అంశం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అప్పట్లో తెలుగునాట అనితతో పాటు ఝాన్సీ, సుమ, ఉదయభాను మొదలైన వారు యాంకరింగ్ చేసేవారు. కానీ అనిత మాత్రమే యాంకరింగ్ తో పాటు, సీరియల్స్‌, సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు చేసేవారు. అలా చిన్నప్పటి నుండి తన ఫ్రెండ్ అయిన ఓ స్టార్ హీరోను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదురైన వింత అనుభవం గురించి అందరితో పంచుకుంది అనిత చౌదరి.

తన క్లోస్ ఫ్రెండ్ అయిన స్టార్ హీరోను అనిత, ఇంటర్వ్యూ టైమ్ లో “ఒరేయ్” అని పిలిచిందట. ఇక దీనితో ఆ స్టార్ హీరో ఫీల్ అయిపోయాడట. దానివల్ల ఆ భాగాన్ని ఇంటర్వ్యూ వీడియో లోంచి ఎడిట్ చేయించి రిలీజ్ చేశారట. అయితే తనతో ఉన్న చనువు వల్ల అలా పిలిచానని చెప్పుకొచ్చింది అనిత. కానీ ఆ స్టార్ హీరో పేరు మాత్రం బయటికి చెప్పలేదు.

Similar Articles

Comments

తాజా వార్తల