Allu Aravind: అల్లు అరవింద్‌కు నలుగురు సంతానమనే విషయం మీకు తెలుసా..?

Allu Aravind: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరిగా అల్లు అరవింద్‌ను చెప్పుకోవాలి. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై ఆయన మర్చిపోలేని బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఈ మధ్య కాలంలో ‘గీత గోవిందం’, ‘అల వైకుంఠపురంలో’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నారు. నేటి యువతరం అభిరుచులకు కూడా తగినట్లుగా మూవీలను అందిస్తున్నారు అరవింద్.

కళ్లు చెదిరే కలెక్షన్స్ సాధించిన ‘కాంతార’
గీతా ఆర్ట్స్ బ్యానర్ ఐదు దశాబ్దాల నుంచి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగడంలో అల్లు అరవింద్‌తోపాటు ఆయన నాన్న, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య పాత్ర కూడా ఉంది. అరవింద్‌కు ఎప్పుడూ ఆయన మద్దతుగా ఉన్నారు. అరవింద్ కూడా తండ్రిలా నటనను ఎంచుకోకుండా ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెట్టడం గమనార్హం. ఇకపోతే, ఇటీవల కన్నడలో రిలీజై సంచలన హిట్టుగా నిలిచిన ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన అరవింద్.. ఆ చిత్రంతో మంచి లాభాలను మూటగట్టుకున్నారు.

అల్లు అరవింద్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరో అల్లు అర్జున్ ఒకరు కాగా, ‘ఊర్వశివో రాక్షసివో’తో హిట్టును అందుకున్న అల్లు శిరీష్ మరొకరు. సినిమా సర్కిల్స్‌లో ఉన్నవారికి అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ (బాబీ) గురించి కూడా తెలిసే ఉంటుంది.

అప్పటికి శిరీష్ పుట్టలేదట..
అల్లు అరవింద్ కు వాస్తవానికి నలుగురు సంతానం. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అల్లు వెంకటేష్ మొదటి సంతానం. ఆయన తర్వాత రాజేష్ జన్మించాడట. రాజేష్​ తర్వాత అర్జున్ పుట్టాడట. అయితే ఐదారేళ్ల వయసులోనే రాజేష్​ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడట. అప్పటికీ అల్లు శిరీష్ ఇంకా పుట్టలేదట. అన్న రాజేష్ మరణించిన తరువాత శిరీష్ జన్మించాడట. ఇకపోతే, వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘గనీ’తో అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ నిర్మాతగా మారారు.

Similar Articles

Comments

తాజా వార్తల