
హైదరాబాద్‌లో ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొత్త చిరునామాగా అల్లు సినిమాస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త మల్టీప్లెక్స్ ప్రధానంగా కొకాపేట్, గండిపేట్, నర్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాల్లో అత్యాధునిక సినిమా అనుభూతికి ఉన్న డిమాండ్‌ను అల్లు సినిమాస్ తీర్చాలని భావిస్తోంది.
ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అత్యుత్తమ సౌండ్ సిస్టమ్, లగ్జరీ సీటింగ్‌తో ప్రత్యేకమైన సినిమా అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మల్టీప్లెక్స్‌ను రూపొందిస్తున్నారు. సౌకర్యం, నాణ్యత పరంగా కొత్త ప్రమాణాలు నెలకొల్పేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
మల్టీప్లెక్స్ ప్రారంభానికి ముందు భారీ హైప్ క్రియేట్ చేయడానికి స్టార్ హీరో అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అల్లు సినిమాస్ కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రమోషనల్ ప్రకటనల షూటింగ్‌ను ఆయన తన టీమ్‌తో కలిసి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనల షూట్ జనవరి తొలి వారంలో జరగనుండగా, అధికారిక ప్రారంభానికి ముందే వాటిని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సంక్రాంతి సీజన్‌లో అల్లు సినిమాస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. మల్టీప్లెక్స్ ప్రారంభ తేదీపై స్పష్టతను నిర్మాత అల్లు అరవింద్ త్వరలో వెల్లడించనున్నారని అంచనా.
అల్లు అర్జున్ స్టార్ పవర్, ప్రీమియం ఫీచర్లతో అల్లు సినిమాస్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రాండ్ ఓపెనింగ్‌కు ముందే ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినిమా ప్రేమికుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
